![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్ అయిన నేహా చౌదరి త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైపోయింది. ఇప్పటికే పెళ్లి మండపం సెట్ చేసేసుకుంది. అలాగే పెళ్లి చీరల షాపింగ్ కూడా చేసేసింది. అన్ని రకాల చీరల్ని వేసుకుని ట్రై చేసింది. నేహా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో ఈమె నేషనల్ ఛాంపియన్. కానీ ఈమెకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అందుకే స్మాల్ స్క్రీన్ మీద ఎక్కువగా షోస్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చింది.
ఇక ఇప్పుడు పెళ్లి చీరలు సెలెక్ట్ చేస్తూ ఉండగా తన కాబోయే భర్త అనిల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమేం చీరలు సెలెక్ట్ చేస్తున్నావో అన్నీ కూడా పిక్స్ పెట్టు అని మెసేజ్ పెట్టేసరికి నేహా కూడా తనను అనిల్ బాగా సపోర్ట్ చేస్తాడని మంచి కంపెనీ ఇస్తాడని, తనకు అలా ఉండడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. పెళ్ళికి కావాల్సిన చీరలు, పెట్టుబడి చీరలు ఇలా మొత్తంగా ఎన్నో రకాల చీరల్ని తీసుకుంది నేహా.
![]() |
![]() |